మెగాస్టార్ అసిస్టెంట్ గా విజయ్ దేవరకొండ

చిరంజీవికి అసిస్టెంట్ గా విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.`ఆచార్య‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా క‌నిపించ‌నున్నారు.

ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత చిరంజీవి మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీగా వుంది. సుకుమార్‌తో పాటు సుజీత్, రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్ర‌ ఈ చిత్ర క‌థ‌ని తెలుగు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో ఖుష్బూ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే పృథ్వీరాజ్ సుకుమార్ పాత్ర‌లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ఇప్ప‌టికే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని సంప్ర‌దిస్తున్నట్లు చెబుతున్నారు.

https://youtu.be/q0um6ZSzqtE

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *