నెపోటిజంపై తనదైన శైలిలో తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు…

నెపోటిజంపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు…

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా బాలీవుడ్‌ మరియు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం పై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తమన్నా మాట్లాడుతూ..మా ఫ్యామిలీలో ఉన్నవారు అందరు డాక్టర్లే. ఒకవేళ నేనూ డాక్టర్‌ని అయ్యుంటే నాకు నా ఫ్యామిలీ వాళ్లు నన్ను గైడ్ చేసి ఉండేవారంటూ. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి ఒకవేళ నా పిల్లలు సినీ ఇండస్ట్రీలోకి వస్తానంటే నేనూ వాళ్లకు గైడ్‌లైన్స్ చేస్తానంది. అందులో తప్పేమీ లేదు అన్నారు.

నా కెరీర్ మొదట్లో నేను తెలుగు, తమిళ సినిమాలు చేయడం ప్రారంభించాను. ఆ సమయంలో ఈ రెండు చోట్ల నాకు ఎటువంటి పరిచయాలు లేవు. అయినా నాకు మంచి ఛాన్సులు వచ్చాయి. నా కష్టాన్ని, నా ప్రతిభను చూసి అవకాశాలు వాటంతట అవే నా తలుపు తట్టాయి. ఇక బంధుప్రీతి, రాజకీయాలు అనేవి ప్రతి ఒక్క రంగంలో ఉన్నాయి. అవి ఒకరి విజయాలను పరాజయాలను నిర్ధేశించలేవంటూ తమన్నా తన అభిప్రాయం తెలిపింది.

https://youtu.be/U7hNzGCdjGg

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *