టాలీవుడ్ లో హిట్ కొట్టాలని చూస్తున్న : తాప్సీ పన్ను

గ్లామర్ తో హిట్ కొట్టాలని చూస్తున్న : తాప్సీ

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మందినాధం’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయింది కానీ ఈ సినిమా ఆశించిన విజయం అందుకొన్నపటికి తాప్సీ తన గ్లామర్ తో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. ఆ తరువాత తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్’ ‘గుండెల్లో గోదారి’ ‘సాహసం’ ‘ఘాజీ’ ‘ఆనందో బ్రహ్మ’ ‘నీవెవరో’ ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాలతో అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు. టాలీవుడ్ లో హిట్ కొట్టలేకపోయాన బాలీవుడ్ లో మాత్రం మంచి విజయాలు అందుకుంది. ‘చష్మే బద్దూర్’ ‘పింక్’ ‘నామ్ సభానా’ ‘బేబీ’ ‘రన్నింగ్ షాదీ’ ‘సూర్మా’ ‘ముల్క్’ ‘బద్లా’ మిషన్ మంగళ్’ ‘సాండ్ కీ ఆంఖ్’ ‘తప్పడ్’ వంటి మంచి చిత్రాలు ఆమెని బాలీవుడ్ లో నిలబెట్టాయి.

హిందీ లో తాప్సీ నటించిన ‘తప్పడ్’ సినిమా ను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాప్సీ పన్ను ఎప్పటి నుంచో సౌత్ లో హిట్ కొట్టాలని చూస్తుంది. ‘తప్పడ్’ తెలుగు రీమేక్ లో నటించే ఛాన్స్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తోందట. తాప్సీ.. చాలా ఇంటర్వ్యూలలో తను ఎన్ని చిత్రాల్లో నటించినా తెలుగు తమిళ చిత్రాలను మాత్రం వదులుకోనని. తాను తమిళ్ తెలుగు భాషల్లో నటించే ఛాన్సెస్ వస్తే కచ్చితంగా నటిస్తానని.. అందుకు ఎన్ని కాల్ షీట్స్ కావాలన్నా కేటాయిస్తానని చెప్పుకొచ్చింది.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *