నాగార్జునకు బర్త్ డే కి అదిరిపోయి గిఫ్ట్ రెడీ చేసిన సమంత

నాగార్జునకు బర్త్ డే కి సమంత స్పెషల్ గిఫ్ట్

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా వేదికగా ద్వారా అభిమానులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. హీరోలు – హీరోయిన్లు ఏదొక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు ఎప్పటికప్పుడు వారి అభిమానులతో విషయాలను పంచుకుంటారు. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారని అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినీ హీరోల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫాలోయర్స్ కామన్ డీపీ అనేది ఒకటి రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు వాళ్ళ హీరో పుట్టినరోజుకు దాదాపు పదిరోజులు ముందే ఒక హడావిడితో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ నెల 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు కావున అక్కినేని అభిమానులు నాగార్జున పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున పుట్టినరోజు కానుకగా కామన్ డీపీ ఒకటి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే నాగార్జున కామన్ డీపీని ఓ ప్రముఖ హీరోయిన్ చేత లాంచ్ చేయనున్నారు. ఆమె ఎవరో కాదు అక్కినేని వారి కోడలు – స్టార్ హీరోయిన్ అయిన సమంత చేతుల మీదుగా నాగార్జున పుట్టినరోజు కామన్ డీపీ విడుదల చేయనున్నారు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటలకు నాగ్ కామన్ డీపీతో అడ్వాన్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ట్విట్టర్ లో కూడా నాగార్జున ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ లతో రికార్డులు బద్దలు కొడతామని అంటున్నారట. ఈసారి నాగార్జున పుట్టినరోజు డీపీని సమంత విడుదల చేయడం కాస్త విశేషం అనే చెప్పాలి.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *