ఆర్టీసీ వాళ్ళు కూలు… జనాలు పూలా …!

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరొచ్చని కేసీఆర్ ప్రకటన

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు విధుల్లోకి తీసుకోవడం సమ్మె వివాదానికి తెరపడింది. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరొచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన….

సమ్మె విరమించిన కార్మికులకు విధుల్లోకి తీసుకోవడంతోపాటు ఆర్టీసీని బలోపేతం చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.ఈ క్రమంలోనే ప్రతి కిలో మీటర్ కు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆయన మంత్రివర్గ సమావేశం అనంతరం తెలిపారు. సుమారునాలుగున్నరేళ్ల తర్వాత ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ చార్జీల పెంపుదలకు నిర్ణయించింది. విభాగాల వారీగా కాకుండా అన్ని బస్సులకు ఏక మొత్తంలో ప్రతి కిలో మీటర్ కు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

ముఖ్యంగా ఆర్టీసీ నష్టాల్లో డీజిల్ ,పెట్రోల్ ధరలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.రెండున్నరేళ్లుగా రోజువారీగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా డీజిల్ ,పెట్రోలు ధరలను కేంద్రం పెంచుతూ వస్తుంది.ఆ ప్రభావం ఆర్టీసీపై గణనీయ ప్రభావం చూపుతుందని, చార్జీలు ఎప్పుడు పెంచిన శాఖలో పెంచేది .తొలిసారి అన్ని సర్వీసుల్లో ఒకే మొత్తంలో 20 పైసలు పెంచాలని నిర్ణయించింది.ఈ చార్జీల పెంపుదలపై ఆర్టీసీ అధికారులు గతంలో చాలా కసరత్తు చేశారు.ఏడాదికి కిలోమీటరుకు పది పైసల చొప్పున పెంచితే ఎంత ,20 పైసలు అయితే ఎంత ఆదాయం వస్తుందని లెక్కలు వేశారు.దూరప్రాంతాల మార్గాల్లో నడిచే volvo, గరుడ ప్లస్ తదితర బస్సుల చార్జీలు ఎక్కువగా ఉన్నాయి .ఈ దఫా కనీస చార్జీలపై శాతం పెంచితే ప్రయాణికులపై మరింత భారం పడుతుందని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.ఆ ప్రకారమే కిలో మీటర్ కు 20 పైసల కు మించి చార్జీలు పెంచి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న దృష్ట్యా ,అంత కే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు .

ఈ పెంపుదలతో తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి 752 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా ,చార్జీల పెంపుదలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఈ మార్గంలో ఎంత ఛార్జ్ పెరుగుతుందనేది ఒకటి రెండు రోజుల్లో లెక్కలు వేస్తామని చెప్పారు. ఎంత మొత్తంలో పెంచితే ఎంత అదనపు ఆదాయం వస్తుందని లెక్కలను మాత్రమే గతంలో వేసామన్నా అధికారులు …పెంపుదలకు సోమవారం వరకు ప్రభుత్వం సమయం ఇచ్చిన నేపథ్యంలో ఆ లెక్కలను సిద్ధం చేస్తామని వివరించారు..ఈ సమ్మెలు లెక్కలు చార్జీల పెంపు బాగానే ఉన్నా …రాష్ట్రంలో దేశంలో ఏ విపత్కర పరిస్థితి వచ్చినా ఆ భారమంతా సామాన్యుడిపైనే అంటూ సామాన్య జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…కెసిఆర్ది అపర చాణక్య మేధస్సు అని కొందరు రాజకీయ నాయకులు పొగిడిన, సామాన్య జనాలు తిట్టుకోవడం మొదలుపెట్టారు.మాటలతో సర్ది చెప్పే సమస్యను ఛార్జీల పెంపు వైపు సాగదీశారు అంటూ మాట్లాడుకుంటున్నారు.

 

                   

Share this article

Subscribe

0 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *