పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఏపీ లో పరీక్షలు రద్దు

ఏపీ లో పరీక్షలు రద్దు చేసిన  ప్రభుత్వం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్ని ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ డిమాండ్ చేశారు. జూన్ 15న అఫీషియల్ గా ఇచ్చిన నోట్ లో పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్రాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా టెన్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని, విద్యార్థులని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని, డిగ్రీ, పీజీ ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దు అయ్యాయని, ఏపీ గవర్నమెంట్ కి గుర్తు చేసిన పవన్…

పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఏపీ లో పరీక్షలు రద్దు

విద్యార్థులే కాకుండా వారి తల్లి తండ్రులు కూడా ఆందోళన పడతారని తన అభిప్రాయం వ్యక్త పరిచాడు. పరీక్ష పేపర్లు కుదించినా ఈ విప్కతర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అంతా మంచిది కాదని తెలుపుతూ, పరీక్షలు క్యాన్సిల్ చేయాలనీ కోరాడు. కరోనా కేసులు పెరుగుతూ ఉండడం, ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు ఉండడంతో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి మరియు ఇంటర్ మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనసేన తరపున పవన్ కళ్యాణ్ కోరాడు కాబట్టే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రజలకి ఏ అవసరం వచ్చినా వారి తరపున పవన్ కళ్యాణ్ తప్పకుండా ఉంటాడని జనసైనికులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కారణం ఎవరైన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *