Pawan is entering into the BJP Is it Confirm….!

పవన్ బిజెపిలోకి ప్రవేశిస్తున్నారా…..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చాక ..రకరకాల స్టంట్స్, ఎన్నో రకాల వేషధారణలతో యూత్ని ఆకట్టుకున్నారు..ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ ముద్ర ఏర్పరచుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.సమస్య, సందర్భం ఏదైనా సరే తను స్పందించిన ప్రతి సారి పార్టీ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతకు ముందు ఎన్నికల్లో తెలుగుదేశానికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో పవన్ స్పీచ్ లకు బోలెడంత ఆదరణ లభించింది.మొన్న జరిగిన ఎన్నికల అప్పుడు జనసేన పేరు చెప్పి ..మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను, మీ కోసం నేను ప్రశ్నిస్తాను.. ప్రజలు ముందుకు వచ్చి ప్రతి సమస్యని నాకు చెప్పండి ఆ సమస్య లేకుండా చేసే దానికి నేను నా ప్రాణాలైనా అడ్డు పెడతాను అని ప్రసంగాలతో ఊగిపోయాడు.ఆ తర్వాత బాబుతో చేతులు కలిపి ప్యాకేజీలతో సర్దుకొని జగన్ ను మాత్రమే టార్గెట్ చేసి అందరి దృష్టిలో అపహాస్యం పాలయ్యాడు.ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. రాజకీయం అంటేనే ఎత్తుగడలు గడపలు ఎక్కి దిగడం అనేది చాలా కామన్.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తో కలిపి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.దానికి సాక్ష్యమే ఈ మధ్య జరిగిన పొలిటికల్ ఎలక్షన్ల నేపథ్యంలో భాజపాపై అగెనెస్ట్ గా చేసిన ట్వీట్ లను డిలీట్ చేయడం పై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీతో మంచి సంబంధాలు నెరుపుతూ ఉన్నారని… ఆ పార్టీతో జనసేన కలిసి పనిచేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా భాజపాను టార్గెట్ చేసిన ట్వీట్ లను పవన్ తొలగించాలని అంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ఢిల్లీ పర్యటన తో కూడా దీన్ని ముడిపెడుతున్నారు కొంతమంది. ఇలాంటి తరుణంలో మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుత భాజపా సభ్యుడు అయిన ఐవిఆర్ కృష్ణారావు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ పవన్ భారతీయ జనతా పార్టీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ గురించి విపరీతమైన దుష్ప్రచారం చేసిన ఆ ప్రచారాన్ని జనాలు నమ్మరు అని,అలాంటి దుష్ప్రచారాలను రివర్స్ చేయగల సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉందని అన్నారు.
పవన్ కళ్యాణ్ పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తి అని ,కేంద్రంలో భాజపా నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి అని.. కొందరు కామెంట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చిన్నాచితకా నాయకుడు కాదని …త్వరలోనే పవన్ కళ్యాణ్ నుంచి ఓ గుడ్ న్యూస్ రాబోతుందని ,చంద్రబాబు ఆడుతున్న నాటకాలు ఆంధ్రప్రదేశ్  లో వర్కౌట్ కాకపోవడంతో దృష్టి అంతా పవన్ కళ్యాణ్పై ఉండడంతో ..పవన్కళ్యాణ్ బిజెపిలో చేరితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గట్టిపోటీ ఇవ్వగలరని భాజపా వర్గాలు భావిస్తున్నాయి మరి చూద్దాం ఎంతవరకు ఇది నిజం అవుతుందో…

                            

Share this article

Subscribe

0 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *