కన్నడ యువ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య..

కన్నడ బుల్లితెర యువ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య

కన్నడ టీవీ బుల్లితెర నటుడిగా పేరు తెచ్చుకున్న సుశీల్ గౌడ్. కర్ణాటకలోని మాండ్యలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సుశీల్ అకాలమరణం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ఆయన మరణ వార్తను తెలుసుకున్న తోటీ నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుశీల్ వయసు 30 ఏళ్లు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా హీరో దునియా విజయ్ నటించిన చిత్రంలో పోలీసు పాత్రలో నటించాడు. అయితే ఇంకా ఆ చిత్రం విడుదల కాకముందే సుశీల్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడటం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.

https://youtu.be/TpTjhCXfw5M

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *