ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఓటీటీ సూపర్ స్టార్ గా సత్యదేవ్

ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఓటీటీ స్టార్ సత్యదేవ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఓవర్ నైట్ స్టార్స్ అవ్వడం చాలా కష్టం. ఎవరో ఒకరు లేదా ఇద్దరికీ మాత్రమే అదృష్టం కలుగుతుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నవారు అందరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సినిమా కష్టాలు అన్నీ చూసి ఉంటారు. అలాంటి వారిలో సత్యదేవ్ ఒకరు. ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత పూరీ దర్శకత్వంలో ‘జ్యోతి లక్ష్మి‘ సినిమాతో హీరోగా కొనసాగుతూ వచ్చాడు. సత్య దేవ్ చిన్న సినిమాల్లో వైవిధ్యభరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సత్యదేవ్..

హీరో సత్యదేవ్ కి ‘ఓటీటీ స్టార్ హీరో’ అనే స్టాంప్ పడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా ‘47 డేస్‘ అనే సినిమా జీ5 ఓటీటీలో విడుదల అయింది. ‘locked‘ వెబ్ సిరీస్ ఆహా యాప్ లో, గాడ్స్ ఆఫ్ ధర్మపురి‘ జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య‘ కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య‘ ఈ మూవీ ‘మహేషింతే ప్రతీకారం’ అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిచారు. ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సత్యదేవ్ ఏదొ ఓక విధంగా ఓటీటీలలో కనిపిస్తుండటంతో అతనికి ‘ఓటీటీ సూపర్ స్టార్‘ అని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నాయి.

https://youtu.be/-fXbxb3bcnM

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *