శ్రియతో ఆ రోజుల్లో అంటూ బాలీవుడ్ నిర్మాత తనూజ్

ఆ రోజుల్లో శ్రియతో అంటూ బాలీవుడ్ నిర్మాత తనూజ్

హీరోయిన్ శ్రియాకు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఆమె నిర్మాత తనూజ్ గార్గ్ తో కలిసి ఉన్నారు.శ్రియ.. ఒకప్పుడు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించారు. తెలుగులో నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తరవాత మరో చిత్రంలో శ్రియ కనిపించలేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కొత్త హీరోయిన్లు రావడం.. రెండోది భర్తతో కలిసి శ్రియ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం.

రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2018 మార్చిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శ్రియ భర్తతో కలిసి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఈ జంట స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్ విధించడంతో శ్రియ దంపతులు బార్సిలోనాలో చాలా రోజులు ఉండిపోవాల్సి వచ్చింది.

తాజాగా శ్రియకు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టారు.శ్రియ భుజంపై చేయివేసి ఆమెపై వాలిపోయి ఉన్నారు తనూజ్. అంతేకాదు, ఆ ఫొటోపై ‘‘అప్పటి తాగిన మత్తులో ఉన్న రాత్రులు. మంచి క్షణాలు’’ అని క్యాప్షన్ పెట్టారు.ఈ ఫొటోను లండన్‌లో తీసుకున్నారట. తనూజ్ గార్గ్ ఇన్‌స్టా స్టోరీ నుంచి ఈ ఫొటో బయటికి రావడంతో వైరల్ అయ్యింది.

https://youtu.be/Bt_AKfeRPVw

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *