దిశ కేసు నిందితులకు ఇప్పట్లో శిక్ష లేనట్లేనా …?

భారతదేశంలో ఉండే చట్టాలు ….దిశ కేసు నిందితులకు ఇప్పట్లో శిక్ష లేనట్లేనా …?

భారతదేశంలో ఉండే చాలా చట్టాలు ,హంతకులకు దోపిడీ దారులకు చుట్టాలు అని చెప్పవచ్చు.నేరాలు-ఘోరాలు 100% నిరూపణ అయితే తప్ప శిక్ష ఖరారు కాదు. ఒక వారం రోజుల క్రితం హైదరాబాద్లోని శంషాబాద్ లో ఒక లారీ డ్రైవరు మరియు అతని స్నేహితులు కలిసి ఒక వెటర్నరీ డాక్టర్ ను ఘోరమైన రీతిలో రేప్ చేసి కాల్చిచంపిన ఉదంతం ఇప్పటికీ అందరి కళ్ల ముందు మెదిలాడుతూనే ఉంది. ఈ సంఘటన ఇప్పుడు జాతీయ స్థాయి టాపిక్ గా మారిపోయింది. ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు మరియు దేశంలోని పెద్దవారు అంతా ఈ విషయంపై స్పందించారు. ముక్కుమ్మడిగా అందరి మాట ఒక్కటే..! వీలైనంత త్వరగా నిందితులకు కఠినమైన శిక్షలు విధించి ఇకపై ఇలాంటి తప్పులు చేయాలి అన్న ఆలోచన రావడానికే జడిసేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని.అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్టు ఈ దేశంలోని ప్రజలందరి కోరిక నెరవేరేలా లేదు.

దిశ కేసు నిందితులకు ఇప్పట్లో శిక్ష లేనట్లేనా ...?
దిశ కేసు నిందితులకు ఇప్పట్లో శిక్ష లేనట్లేనా …?

మన భారత దేశంలోని న్యాయస్థానం నుండి కొన్ని చట్టాలు ఏ విధంగా రూపొందించబడ్డాయి అంటే వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్నట్లు. ఇప్పుడు ఈ విషయాన్ని నిందితులు ఆసరాగా తీసుకొని వారికి ఖచ్చితంగా పడిపోయే ఉరిశిక్షను జాప్యం చేస్తున్నారట. ఇప్పటివరకూ వార్తల్లో వచ్చిన ప్రతి ఒక్కదానిలో నిందితులు అలా చేశారు ఇలా చేశారు అని పోలీసు వారు చెబుతున్నారే కానీనే వారు కోర్టు ముందుకు వెళ్లి తాము చేసిందంతా పూస గుచ్చి వివరించలేదు.

ఇకపోతే ముంబై దాడుల్లో కసబ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా అతన్ని ఉరి తీయడానికి దాదాపు సంవత్సరన్నర రోజులు పట్టింది. అందుకు కారణం చట్టంలోని లొసుగులు మరియు అతని పై కేవలం ఆ దాడికి సంబంధించిన కేసు ఒక్కటే కాకుండా మరొక 72 కేసులు ఉండటం. ఆ కేసులన్నింటినీ కూడా న్యాయస్థానం విచారించి అన్నీ శిక్షలను జమ చేసి, వాయిదాల మీద వాయిదాలు వేసి చివరికి ఉరిశిక్ష వేస్తున్నట్లు తీర్పు ప్రకటించే సరికి పుణ్యకాలం కూడా గడిచిపోయింది. ఇప్పుడు కూడా కచ్చితంగా ఈ నలుగురు విషయంలో కూడా ఇదే జరగబోతుందని సమాచారం. అందుకే నేరం జరిగిఅ తరువాత శిక్ష వేసే కన్నా అసలు నేరం చేసేందుకే భయపడేలా చట్టాన్ని నిర్మిస్తే మేలని అంతా మొదటినుంచి మొత్తుకుంటున్నారు.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *