బాలకృష్ణ తెలుగులో సూపర్ మాన్ అవ్వనున్నాడా?

బాలకృష్ణ తెలుగులో సూపర్ మాన్ అవ్వనున్నాడా?

”సింహ, లెజెండ్” లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.
బాలయ్య డిఫరెంట్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వచ్చిన మాట తెలిసిందే. కానీ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ మూవీకి ‘సూపర్ మ్యాన్’ టైటిల్ ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. కథను బట్టి చూస్తే సూప‌ర్ మ్యాన్ అనే టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని భావించిన బోయపాటి.. బాలయ్య ముందు ఆ ప్రపోజల్ పెట్టడంతో ఆయన సైతం ఓకే అనేశారని టాక్.
ఇకపోతే ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. బోయపాటి మార్క్ చూపిస్తూ బాలయ్య చేత చెప్పించిన ఊరమాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.

https://youtu.be/f0zLiyErNqM

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా కోసం ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కథకు ఈ టైటిల్ అయితేనే సరిగ్గా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట.

Share this article

Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *