
Tamannaah Is Ready To Entertain Mahesh Babu Fans ….
సరిలేరు నీకెవ్వరు టీం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో ఫోకస్ పెట్టారు …సినిమాలో ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు…ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ,టీజర్ మిశ్రమ స్పందన వచ్చిన సినిమా మీద హైప్ ఏమాత్రం తగ్గలేదు.. ఇప్పుడు సరిలేరు టీం ఫ్యాన్స్ కు ఇంకోక సర్ప్రైస్ ఎలిమెంట్ ని రిలీజ్ చేశారు …
హాట్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తూనే అడపాదడపా స్టార్ హీరోస్ మూవీస్‌లో ఐటెం సాంగ్స్ చేస్తుంది . కొద్ది రోజులుగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తుందనే వార్త సోషల్ noమీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. దీంట్లో ఎంత క్లారిటీ ఉందనేది తెలియక అభిమానులు ఆందోళనకి గురయ్యారు. తాజాగా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. గ్లామర్ బ్యూటీ తమన్నా 30వ వసంతంలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు ఇటీవల సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంట్లో తమన్నా పాత్రకి ప్రశంసలు లభించాయి. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్న తమన్నాకి సంబంధించిన లుక్ తాజాగా విడుదలైంది. ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని తమ్మూ బేబీ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తుంది. ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా’ అనే ఫన్నీ లిరిక్స్‌తో తమన్నా స్పెషల్ సాంగ్ ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం.ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పాటను షూట్ చేశారట. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారని తెలుస్తుంది. తమన్నా ఇంతకుముందు ఐటెం సాంగ్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి .
ఇప్పటివరకు ఐటెం సాంగ్స్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ అంటే స్వింగ్ జరా స్వింగ్ జరా జై లవకుశ లో చేసిన ఈ సాంగ్ మంచి ఆదరణ లభించింది…అలాగే అల్లుడు శీను లో కూడా ఓ మంచి కిరాక్ ఐటమ్ సాంగ్ చేసింది తమన్నా ….ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు లో డిఫరెంట్ లుక్ తో పాటు తన తన మేనరిజమ్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ ని అలరించే డానికి రెడీ గా ఉందట తమన్నా ….చూద్దాం ఫన్నీ లిరిక్స్ తో పాటు ఎలాంటి స్టెప్పులతో అలరిస్తుందని థియేటర్లో చూద్దాం ….ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. విజయశాంతి దాదాపు 8 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇస్తుంది…