ముద్దులే కాదు హగ్గులకు కూడా నో : రెజీనా
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన హీరోయిన్స్ లో రెజీనా ఒకరు. ఇటీవల మీడియాతో ముచ్చటించిన రెజీనా తన రాబోయే చిత్రాల్లో ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు చేయడానికి తనకు భయమేస్తోందని రెజీనా చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముద్దులే కాదు హగ్గులకు కూడా నో చెప్పాలని . అందుకే ఈ ముద్దుగుమ్మ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అసలే బయట కరోనా వైరస్ ప్రాణాలు తీస్తుంది. దాంతో బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు జనం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్స్ అంటే అంతకంటే సాహసం మరోటి ఉండదేమో..?