పెళ్లి కి ఓకే చెప్పిన కీర్తి సురేష్
గత కొంతకాలంగా టాలీవుడ్ ‘మహానటి’.. కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కీర్తి సురేష్ ప్రేమ గురించి వచ్చిన వార్తలు నిజమేనని, ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడు, బిజినెస్ మ్యాన్‌తో కీర్తి సురేష్ పెళ్లికి ఓకే చెప్పిందని సమాచారం. కీర్తి కుటుంబ సభ్యులు పెళ్లిపనులు కూడా మొదలుపెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఆ బీజేపీ నాయకుడు ఎవరు? వారి కుమారుడు ఎవరు ? అన్న విషయం మాత్రం ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచారు. మరి మహానటిని పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.