కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా కొత్త సినిమా
‘దేవదాస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల భామ ఇలియానా… అతితక్కువ సమయంలోనే గ్లామర్ రోల్స్ చేయడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నంతగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ స్టార్ హీరోస్ అందరితో చేసిన ఇలియానా ఆ తరువాత మెల్లగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్కడ స్టార్ స్టేటస్ పొందాలని చూసింది. వరుసగా సినిమాలైతే చేసింది కానీ ఆశించిన ఫేమ్ మాత్రం రాలేదు.
దీంతో కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్న ఇలియానాని రవితేజ శ్రీను వైట్ల పట్టుబట్టి మరీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చేలా చేశారు. ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే ఇలియానా కంటిన్యూ అయ్యేది కానీ, రిజల్ట్ తేడా కొట్టడంతో గోవా బ్యూటీకి అవకాశాలు కనుమరుగయ్యాయి. ఇక ఇలియానా కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైములో కింగ్ నాగ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన ‘రైడ్’ మూవీని టాలీవుడ్‌లో నాగార్జున రీమేక్ చేయాలనుకుంటున్నాడని సమాచారం. ఒరిజినల్ సినిమాలో హిరోయిన్ గా చేసిన ఇలియానానే రీమేక్ లో కూడా కంటిన్యూ చేయించాలని డైరెక్టర్ భావిస్తున్నాడట. ఇదే జరిగితే గోవా బ్యూటీకి తెలుగులో మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే.