తెలుగు సీరియల్ నటి నవ్యా స్వామికి కరోనా…
కరోనా ప్రభావంతో ఆగిపోయిన టీవీ పరిశ్రమ షూటింగ్‌లు. ఇటీవల ప్రభుత్వ సడలింపులతో షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కాగా.. సీరియల్స్‌తో పాటు బుల్లి తెర ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే తాజాగా బుల్లితెర స్టార్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నవ్య స్వామి ఈటీవీలో ‘నా పేరు మీనాక్షి’ మరియు స్టార్ మాలో ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కొద్ది రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ టెస్టుకు వెళ్లగా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఈ రెండు సీరియల్స్ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.