సుమ కనకల ఆర్టిస్టుగా అవకాశాలు
సుమ 1990 వ సంవత్సరంలో సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినది. ఆమె అప్పుడు మూడు సీరియల్స్ కంటే ఎక్కువ చేసింది.కొన్ని సీరియల్ పేర్లు మేఘాలయ, మందాకిని మరియు సమత. ఇప్పుడే సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, బుల్లి తెరపై నటిచేందుకు ఎక్కువగా ఇష్టపడతానని ఆమె చెప్పింది. ఆమె తన ప్రేక్షకులకు ఆ విధంగా సన్నిహితంగా ఉండగలను అని భావించింది.
ఆమె హాస్యం మరియు ఇబ్బందికరమైన పరిస్థితులను పరిష్కరించే సామర్ధ్యంతో, ఎంటర్ టైన్ లో ఆమెకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న వేడుకలకు హోస్ట్‌గా ప్రారంభమైన ఆమె ఇప్పుడు బాహుబలి వంటి దాదాపు అన్ని ప్రధాన చలనచిత్రాలైన ఆడియో విడుదలలలో ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తుంది.
సుమ కనకల కి బాగా గుర్తింపు తెచ్చిన షో
సుమ కి బాగా గుర్తింపు తెచ్చిన షో లు అవాక్కుయరా ! మరియు పట్టుకుంటే పట్టుచీర ఇటువంటి ప్రోగ్రాం లతో మహిళలకుఎంత గానో దగ్గర అయ్యారు. ఆమె కు ఎక్కువగా పేరు తెచ్చినవి.
మా టీవీ లో Bhale chansule, ఈటీవీ లో క్యాష్ ప్రోగ్రామ్. మరియు ప్రైమ్‌టైమ్ షోల తో బిజీగా మారి పోయినది. ఇది కాకుండా ఆమె జెన్ ‘(జీన్స్) అనే షోలో యాంకర్ గా చేసి విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అలాగే కె. సుమా రాజీవ్ క్రియేషన్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి లక్కూ కిక్కు అనే షోను నిర్మించి ZEE తెలుగులో మరియు సహ నటుడు మనోతో కలిసి MAA TV లో కెవ్వు కేక అనే ఆమె కొత్త ప్రోగ్రాంను నిర్మించారు.