Sayyeshaa Celebrated Arya’s Birthday | సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉన్నాయి || Tvnxt

ఆర్య సయేశా ఎక్కడికి వెళ్లారు తెలిస్తే షాక్ అవుతారు …?

సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉన్నాయి గా …!

సినిమా ఇండస్ట్రీలో రీల్ కపుల్స్ రియల్ కపుల్ గా మారడం మనం చాలా జంటల్ని చూశాం.ఆర్య – సయేషా సైగల్ జంట సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే. భలే భలే మగాడివోయ్ రీమేక్ `గజినీకాంత్`లో జోడీగా నటించారు. ఆ తర్వాత సూర్య బందోబస్త్ సినిమాలోనూ కీలక పాత్రలు పోషించారు. ఆ క్రమంలోనే ఈ జోడీ ప్రేమ వివాహం చేసుకున్నారు. అటుపై సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే. ప్రస్తుతం మాల్దీవుల సెలబ్రేషన్ లో ఉన్నారు. ఈ జోడీ యూత్ కి సరికొత్త గోల్ ని ఫిక్స్ చేస్తోంది. ఇటీవలే `టెడ్డీ` షూటింగ్ ముగించుకుని ఆ తరువాత.. ఆర్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. ఆ క్రమంలోనే స్పాట్ నుంచి హబ్బీతో రొమాంటిక్ గా స్పెండ్ చేసినప్పటి ఫోటోల్ని సయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక సయేషా సైగల్ ఇన్ స్టాగ్రామ్ లోని ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆర్యతో మాల్దీవుల సెలబ్రేషన్ క్యూట్ గా ఉంది..  మొదటిసారి అండర్వాటర్ డైవింగ్ చేశానని.. బీచ్ సైక్లింగ్ ఎంజాయ్ చేసానని సయేషా తెలిపింది. హబ్బీ ఆర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ..ఓ రొమాంటిక్ ఫోటోని షేర్ చేసింది. “పుట్టినరోజు శుభాకాంక్షలు నా జాన్! నువ్వు గొప్ప వ్యక్తి! నీకు ప్రతిదీ బెస్ట్ దొరకాలి.. ఐ లవ్ యు“ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక మాల్దీవుల్లో మొదటిసారి డైవింగ్ చేసిన కొన్ని ఫోటోల్ని సయేషా పంచుకుంది. ఈ తొలి అనుభవం.. ఎప్పటికీ మర్చిపోలేని నిధి ఇది.. నమ్మశక్యం కాని సరికొత్త ప్రపంచమిది! అని తెలిపింది.

ఈ జోడీ నటించిన టెడ్డీ చిత్రీకరణ మెజారిటీ పార్ట్ చెన్నయ్ ..యూరప్ లో సాగింది. దీనిని స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ నిర్మిస్తున్నారు. శక్తి సౌందర రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ కి రానుంది.సయేషా మన తెలుగులో అఖిల్ సరసన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసి అమ్మడికి అందంతో పాటు అభినయం కూడా ఉందని నిరూపించుకుంది కానీ తెలుగులో మాత్రం హిట్ కొట్టలేకపోయింది ఆ తర్వాత ఆ తర్వాత హిందీ తమిళ తోపాటు సినిమాలు ఆడ్ చేసింది …అక్కడే ఆర్య ఆర్యతో లవ్ సెట్ చేసుకుని హ్యాపీగా పెళ్లి చేసేసుకుంది.. పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఇద్దరూ టైం దొరికినప్పుడల్లా ఫుల్ ఎంజాయ్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ అవుతుంటాయి.

 

సరిలేరు నీకెవ్వరు లో విలన్ ఎవరో తెలిసిపోయింది….

అసలు ఏవరు ఈ నయనతార ? Full Life Story

మహిళలు అత్యున్నత స్థానాల్లో ఉండాలన్నది ఆమె ఉమెన్ ఇజం…. నిర్మల సీతారామన్

                                  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here