సరిలేరు నీకెవ్వరు లో విలన్ ఎవరో తెలిసిపోయింది….

‘సరిలేరు నీకెవ్వరు`లో బలమైన విలన్ క్యారెక్టర్ గా ఎవరో తెలిసిపోయింది….

సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత బలంగా ఉంటుందో అంతే బలంగా విలన్ క్యారెక్టర్ ఉంటేనే సినిమాకి మైలేజ్ వస్తుంది ..తెలుగులో ఇండస్ట్రీ రీకార్డ్స్ బద్దలు కొట్టిన సినిమాలో అన్నిట్లోనూ విలన్ క్యారెక్టర్ అంతే అద్భుతంగా ఉంటుంది …మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాల్లో అయితే హీరో కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు..ఒక్కడు, పోకిరి ,శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇలా ఏ సినిమా గురించి చెప్పుకున్న అందులో విలన్ పాత్రలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మహేష్ బాబు సినిమా ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉంది.

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనీల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన కథానాయిక. ఇటీవలే రిలీజైన టీజర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. టీజర్ లో రకరకాల పాత్రల్ని పరిచయం చేశారు. అయితే ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరికీ కలిగిన అనుమానం ఇంతకీ ఇందులో విలన్ ఎవరు? అనేదే. “ఈ పండక్కి మొగుడొచ్చాడు“ అంటూ ప్రకాష్ రాజ్ పంచ్ వేయడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. టీజర్ లో… ముఖం అంతా చిట్లించుకుని ప్రకాష్ చెప్పిన డైలాగ్ ని బట్టి ఇందులో ఆయనే విలన్ గా నటిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఆర్మీకి చెందిన స్థలాన్ని రాజకీయ నాయకుడైన ప్రకాష్ రాజ్ కబ్జా చేస్తే అతని కళ్లు తెరిపించే క్రమంలో మహేష్ తన చుట్టూ వున్న వాళ్లకి బడితపూజ చేస్తాడు మహేష్. ఆ క్రమంలో వచ్చే `మనదగ్గర బేరాల్లేవమ్మా..` డైలాగ్ ఇద్దరి మధ్య వచ్చే ఇంటెన్సివ్ సీన్స్ కి కొదవేమీ లేదని అర్థమైంది. మహేష్.. ప్రకాష్ రాజ్ కలయికలో వచ్చిన పోకిరి.. ఒక్కడు వంటి చిత్రాల్లో ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్.. వైరం కీలకంగా అలరించాయి. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంలో ప్రధాన భూమికను పోషించాయి. అదే మ్యాజిక్ `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి కూడా వర్కవుట్ అవుట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే `ఒక్కడు` చిత్రంలోని కొండారెడ్డి బురుజు.. ప్రకాష్ రాజ్ చెప్పే రొటీన్ డైలాగ్ లు చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోందని సగటు ఆడియన్ ఫీలవుతున్నాడు. మరి అది థియేటర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా?  లేక ఒక్కడు.. పోకిరి మ్యాజిక్ రిపీట్ అయి `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా? అన్నది తెలియాలంటే జనవరి 11 వరకు వేచి చూడాల్సిందే.

Sarileru Neekevvaru Fourth Song Update :

Sri reddy ComeBack Chances in Telugu Cinema.

RRR Movie Updates

                                      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here