మహిళలు అత్యున్నత స్థానాల్లో ఉండాలన్నది ఆమె ఉమెన్ ఇజం…. నిర్మల సీతారామన్

నిర్మలా సీతారామన్ కి ప్రతిష్టాత్మకమైన అవార్డు…

నిర్మలా సీతారామన్  మాట శత్రువులకు కటువుగా ఉంటుంది,నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది…అనుకున్నది చేయడమే ఆవిడ నైజం..ఆవిడ మాటల్లో ఉంటుంది నిజం…మహిళలు అత్యున్నత స్థానాల్లో ఉండాలన్నది ఆమె ఉమెన్ ఇజం….ఆవిడే నిర్మల సీతారామన్
భారతదేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్‌, ప్రపంచంలోని అత్యంత శక్తిమంత 100 మంది మహిళలతో ఫోర్బ్స్‌ రూపొందించే జాబితాలోనూ తొలిసారిగా చోటు దక్కించుకున్నారు. ప్రభుత్వ, వ్యాపార, దాతృత్వ, ప్రసార మాధ్యమ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళలతో ఈ జాబితా రూపొందించారు.ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత శక్తిమంత 100 మంది మహిళలతో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితాలో భారతీయులు ముగ్గురికి చోటు లభించింది.
గతంలో రక్షణశాఖ నిర్వహించి, ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్‌కు 34వ స్థానం లభించింది. గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మాత్రమే ఆర్థిక మంత్రి బాధ్యతలను స్వల్పకాలం పాటు అదనంగా మాత్రమే నిర్వహించారు. ఆర్థికమంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలే.హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రాకు 54వ స్థానం దక్కింది. 8.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.62,300 కోట్ల) విలువైన సంస్థ వ్యూహాత్మక నిర్ణయాలకు ఆమే బాధ్యురాలు. శివ్‌నాడార్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ కూడా.  ఈ ఫౌండేషన్‌, దేశంలో ప్రఖ్యాత పాఠశాలలు, కళాశాలలను నిర్వహిస్తోంది.

బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షాకు 65వ స్థానం లభించింది. దేశంలో స్వీయప్రతిభతో సంపన్న మహిళగా రాణిస్తున్నారు. 1978లో ఆమె స్థాపించిన బయోకాన్‌ దేశంలోనే అతిపెద్ద బయోఫార్మా సంస్థగా ఎదిగింది. అమెరికా బయోసిమిలర్స్‌ విపణిలోకీ సంస్థ ప్రవేశించి, క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించే 2 రకాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది.

ఈ జాబితాలో వరుసగా 9వ ఏడాదీ అగ్రస్థానంలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఉన్నారు. రెండోస్థానంలో యూరోపియన్‌ సెంట్రల్‌బ్యాంక్‌ అధ్యక్షురాలు క్రిస్టీన్‌ లగార్దె, మూడోస్థానంలో అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి ఉన్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 29వ స్థానం పొందారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహ ఛైర్‌పర్సన్‌ మిలిందా గేట్స్‌ (6), ఐబీఎం సీఈఓ గిన్నీ రొమెట్టీ (9), ఫేస్‌బుక్‌ సీఓఓ షెరిల్‌ శాండ్‌బర్గ్‌ (18), న్యూజిలాండ్‌ ప్రధాని జకిందా ఆర్దర్న్‌ (38), అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ (42), గాయకురాళ్లు రిహన్నా (61), బెయాన్స్‌ (66), టేలర్‌ స్విఫ్ట్‌ (71), టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ (81), పర్యావరణ ఉద్యమవేత్త గ్రెటా థంబర్గ్‌ (100) స్థానాల్లో ఉన్నారు.
నిర్మల సీతారామన్ అంటే బిజెపి సిద్ధాంతాలను, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కట్టుబాట్లలకు కట్టుబడి ముందుకు నడిపించే మహిళల్లో ముందంజలో ఉంటారు అనడానికి ఎలాంటి సందేహం లేదు అలాంటి మహిళ ఇలాంటి ఘనత సాధించడం మన భారతీయులందరూ ఎంతో సంతోషించాల్సిన విషయం.

 

పౌరసత్వ బిల్లు పై ఢిల్లీ యూనివర్సిటీ దద్దరిల్లింది ..!

అసలు ఏవరు ఈ నయనతార ? Full Life Story

Pawan Is Entering Into The BJP Is It Confirm….!

                                      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here