పౌరసత్వ బిల్లు పై రగడ దేశం మొత్తం రగిలిపోతుంది||నిరసనలు, ధర్నాలు,రాస్తారోకోలు ఆందోళనలు….
పౌరసత్వ బిల్లు పై రగడ దేశం మొత్తం రగిలిపోతుంది అనే చెప్పాలి…బిజెపి కొన్ని పార్టీలు తప్ప మిగిలిన ఇతర ప్రతిపక్షలన్ని ఖండించడంతో నిరసనలు, ధర్నాలు,రాస్తారోకోలు ఆందోళనలు మొదలయ్యాయి.నిన్న ఢిల్లీ జామియా వర్సిటీ రణరంగం… పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హోరెత్తిన నిరసన ప్రదర్శనతో.. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ రణరంగంలా మారింది. విద్యార్థులు, ప్రజలు కలిసి ఆదివారం సాయంత్రం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు మూడు బస్సులకు, వందకు పైగా ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేశారు. విశ్వవిద్యాలయం లోపలికి ప్రవేశించి 50 నుంచి 100 మంది దాకా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు. విద్యార్థులు 200 నుంచి 300 మంది దాకా వస్తారని అంచనా వేసి ఆమేరకు తాము సన్నద్ధమయ్యామని.. కానీ, స్థానిక గూండాలు నిరసన ప్రదర్శనలోకి చొరబడి వాహనాల దహనానికి పాల్పడ్డారని.. ఆపడానికి ప్రయత్నిస్తే రాళ్లు విసిరారని.. పోలీసులు చెబుతున్నారు…
పరిస్థితిని అదుపు చేసేందుకే తాము చర్యలు తీసుకున్నామని వివరిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు చెందిన ఇద్దరికి, ఆరుగురు పోలీసులకు రాళ్లదాడిలో గాయాలయ్యాయని.. ఒక ఫైరింజన్ ధ్వంసమైందని వెల్లడించారు. అయితే, విద్యార్థులు మాత్రం తాము శాంతియుతంగానే నిరసన తెలిపినట్టు స్పష్టం చేస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలోకి పోలీసులు అనుమతి లేకుండా, బలవంతంగా ప్రవేశించారని.. తమ విద్యార్థులను, అధ్యాపకులను కొట్టి క్యాంపస్ వీడి వెళ్లాలని ఆజ్ఞాపించారని.. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ చీఫ్ ప్రోక్టర్ వసీమ్ అహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. వర్సిటీ సమీపంలో ఆందోళనకు దిగిన కొందరు వ్యక్తులు లాఠీచార్జి మొదలవగానే వర్సిటీ ప్రాంగణంలోకి పరుగెత్తారని.. వారి కోసమే పోలీసులు లోపలికి వెళ్లారని కొందరు చెబుతున్నారు. కానీ.. పలువురు విద్యార్థులు రెండు చేతులూ పైకెత్తి వర్సిటీలోంచి బయటకు వస్తుండగా పోలీసులు వారి వెనుక ఉన్న దృశ్యాలు మీడియాలో ప్రచారమయ్యాయి. కాగా.. జరిగిన హింసను ఖండిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం వర్సిటీ వద్ద కూడా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకం గా జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. వర్సిటీలోకి ప్రవేశించిన పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వ గా.. పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు.
బెంగాల్‌లో హింస.. ఉపశమిస్తున్న ఈశాన్యం..
పౌరసత్వ చట్టంపై బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముర్షీదాబాద్, హౌరా, నార్త్24 పరగణా, మాల్దా జిల్లాల్లో అకడక్కడా ఆందోళనలు జరిగాయి. ఈ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో మార్గం ఉండదని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
నా భారతదేశం పై అన్యమతస్తుల మిషనరీల పన్నాగం..?
మందు ప్రియులకు మళ్లీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..!