Chiranjeevi As Chief Guest For Sarileru Neekevvaru Pre Release Event | Tvnxt

సరిలేరు నీకెవ్వరు రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ రావడానికి కారణం ఇదే… || Tvnxt

1.వరుస హిట్లతో మాంచి దూకుడు మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పోటీబరిలో మెగా మూవీ అల వైకుంఠపురములో.. దాంతో పాటే రజనీ మూవీ `దర్బార్`.. కళ్యాణ్ రామ్ మూవీ `ఎంత మంచి వాడవురా` రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అయితే ఎంత పోటీ ఉన్నా ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టడమే లక్ష్యంగా మహేష్- అనీల్ రావిపూడి బృందం పక్కాగా ప్రణాళికను రచిస్తున్నారు.

చరిత్రలో మొట్టమొదటి సారిగా ఘట్టమనేని అభిమానులతో పాటుగా మెగాభిమానులను కలిపే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా జనవరి 5న జరగనున్న భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ అతిధిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. మెగా బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో ఆ ఆనందంలో అనీల్ రావిపూడి బృందం అధికారికంగా ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జనవరి 5న జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారని ప్రకటించారు.

ఆ మేరకు ఓ వీడియో ప్రకటనను రిలీజ్ చేయడం ఆసక్తికరం. “మీరు మెగా ఈవెంట్లను చూసి ఉండొచ్చు. సూపర్ ఈవెంట్లు చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాం. సూపర్ స్టార్ హోస్ట్ చేయబోతున్న ఈవెంట్ కు మెగాస్టార్ అతిథిగా రాబోతున్నారు. మెగా సూపర్ ఈవెంట్ కు రెడీ కండి“ అంటూ ఆ వీడియో ద్వారా చిత్రబృందం అభిమానులకు పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో సరిలేరు ఈవెంట్లో మెగా – ఘట్టమనేని అభిమానుల కుమ్ముడు ఖాయమైనట్టే. అసలే మెగాస్టార్ వస్తున్నారు! అంటే మెగాభిమానుల్ని పట్టుకోవడం కష్టం. ఇక సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ జత అయితే ఇంకేం ఉంది.. ఆ ఈవెంట్ లో కుమ్ముడే కుమ్ముడు అని అంచనా వేస్తున్నారు. మహేష్ సినిమా ఈవెంట్ కోసం చిరంజీవి రావడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో బోలెడంత ఎగ్జయిట్ మెంట్ కనిపిస్తోంది.

ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తుండగా.. విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రలో నటిస్తున్నారు. అందాల రష్మిక మహేష్ నాయికగా కనిపించనుంది. ప్రకాష్ రాజ్- రాజేంద్ర ప్రసాద్ సంగీత- బండ్ల గణేష్- వెన్నెల కిశోర్- సుబ్బరాజు- హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దిల్ రాజు- అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించారు …అలా ఇద్దరినీ ఒకే స్టేజి మీద చూసే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు.ఈవెంట్ కి రావడానికి మహేష్ బాబు ఎంత కారణం అవుతాడో విజయశాంతి కూడా అంతే కారణం అంటున్నారు…మహేష్ బాబు కృష్ణ గారు మీద ఎంత అభిమానం ఉందో విజయశాంతి మీద కూడా అంతే కన్సర్ ఉందని ఇన్సైడ్ వర్గాల టాక్ ..చూద్దాం మరి ఈవెంట్ ఎంత గ్రాండ్గా ఉండబోతుందో….

                                       

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here