అల్లరి నరేష్ మేకప్ లేకుండ‌ సరికొత్త ప్రయోగాలకు ‘నాంది’

సరికొత్త ప్రయోగాలకు ‘నాంది’ పలికిన అల్లరి నరేష్

టాలీవుడ్‌లో అల్లరి నరేష్ అంటే కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు వరుసగా ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ సక్సెస్ అందుకున్న నరేష్ గత కొద్దీ కాలంగా ఎంత శ్రమిస్తున్నా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. నరేష్ కామెడీ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు కూడా చేశారు.ఇప్పుడు ‘నాంది’ అనే థ్రిల్లర్ మూవీతో అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నాంది’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నరేష్ మేకప్ లేకుండా నటించాడు. అంతేకాదు, నగ్నంగా కూడా కనిపించనున్నాడు. ‘నాంది’ సినిమా గురించి అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కథ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని, అందుకే నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here