బాధ్యత ఉండక్కర్లేదా అంటున్న.. ప్రిన్స్ మహేష్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దని జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని ప్రజలకు సూచించారు స్టార్ హీరోలు. లాక్‌డౌన్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి లేకపోయినా.. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తరవాత కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. ఇటువంటి సమయంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి అని సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు.
ప్రజలంతా జాగ్రత్తతో, బాధ్యతతో వ్యవహరించి కరోనాతో పోరాడాలని మహేష్ బాబు చెప్పారు. ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకుంటు అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడాలి. మీరు బయటికి వెళ్లే ప్రతిసారి మాస్క్ ధరించండి. మీ చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరాన్ని పాటించండి. అన్ని జాగ్రత్తలూ పాటించండి. అలాగే, ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాటుఫామ్ పోస్ట్ చేశారు.