సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్ కె నాయుడు పై సాయిసుధ ఫోర్జరీ కేసు

శ్యామ్ కె నాయుడు పై సాయిసుధ ఫోర్జరీ కేసు

తెలుగు లో అర్జున్ రెడ్డి’ మరియు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసిన సాయిసుధ.. సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు శ్యామ్ కె.నాయుడును అరెస్ట్ చేసి విచారణ జరిపిన పోలీసులు రిమాండుకు తరలించిన సంగతి తెలిసిందే. కాని అరెస్టయిన రెండు రోజుల్లోనే బెయిల్ మీద బయటికి వచ్చాడు.
శ్యామ్ కే నాయుడు సాయిసుధతో కాంప్రమైజ్ అయినట్లు ఇద్దరి సంతకాలతో కూడిన పత్రాలతో పిటిషన్ వేయడంతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. శ్యామ్ తో సాయిసుధ రాజీకి రాలేదని, రాజీ పత్రాలలో తన సంతకాన్ని మార్ఫింగ్ చేసారని సాయిసుధ పేర్కొంది. బెయిల్ పిటిషన్ పై సంతకం తనది కాదని శ్యామ్ మంజూరు అయినా బెయిల్ పై సవాల్ చేస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించిన సాయి సుధ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here