అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారంలో చాలా గట్టివాడు అంటున్న మలైకా అరోరా
బాలీవుడ్ లో ఫిట్నెస్ గురించి చెప్పాలి అంటే… మలైకా అరోరా ను చూపిస్తే సరిపోతుంది. 46 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌లో హీరో హీరోయిన్స్ డేటింగ్ వ్యవహారాలు చాల కామన్. సంవత్సరాల కొద్ది ప్రేమ అంటు తిరగడం వారికి మామూలు విషయమే. బాలీవుడ్ నటి మలైకా అరోరా కొన్నేళ్లుగా తనకంటే 11 సంవత్సరముల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోందిని బాలీవుడ్ కోడై కూస్తున్నది. మలైకా అరోరా అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అర్జున్ కపూర్ లాంటి యువ హీరో ఆమెను ప్రేమించి డేటింగ్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను అర్జున్ కపూర్‌తో డేటింగ్ వ్యవహారంపై పెద్దగా స్పందించింది లేదు. మలైకా- అర్జున్ కపూర్ మధ్య గ్యాప్ వచ్చింది అని, ఆ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోనున్నారనే వార్త ఈ మధ్యకాలంలో బాగా షికారు చేస్తున్నాయి.అర్జున్ చిన్నవాడైనా డేటింగ్ వ్యవహారంలో చాలా గట్టివాడంటూ అర్జున్ కపూర్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పి ఆ సీక్రెట్ బయటపెట్టేసింది. మలైకా చేసిన ఈ కామెంట్ చూసి బీ టౌన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.