రొమాంటిక్ సీన్లలో నటించను అంటున్న…అభిషేక్

రొమాంటిక్ సీన్లలో నటించను అంటున్న…

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తొలిసారిగా న‌టించిన వెబ్ సిరీస్‌ ‘బ్రీత్ ఇంటు ది షాడోస్’ విడుద‌ల‌ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడాడు. తాను ఎంపిక చేసుకునే సినిమాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాను ఏదేనా సినిమాను ఓకే చేసేముందు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో ‘రొమాంటిక్‌ స‌న్నివేశా‌ల్లో న‌టించడానికి ఇబ్బంది ప‌డుతున్నాను అని చెప్పి కొన్ని కండిష‌న్స్ కూడా పెడుతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఎందుకంటే అలాంటి సీన్ల‌లో తనను చూసేందుకు తన కూతురు ఇబ్బందిప‌డ‌టం తనకు ఇష్టం లేదు అని. తన కుమార్తె ఆరాధ్య పుట్టాక నాలో చాలా మార్పు వచ్చింది అని. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నా కూతురు అడిగే ప్ర‌శ్న‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌లేనని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here